మన పాఠశాల
“విద్యా దదాతి వినయం –
వినయం దదాతి పాత్రతః “
అన్నారు మన పెద్దలు. అలాంటి విద్య ,పాత్రత అనేది మన మాతృ భాష లో జరిగితే అది అమోఘమైన
విలువలతో కూడినది అయి ఉంటుంది . వృత్తి ,వ్యాపారాల దృష్ట్యా నేటి సామాజిక ప్రపంచంలో తల్లిదండ్రులు
మన మాతృభూమికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఎదురయింది . ఇలాంటి ఆలోచనలో నుండి వెల్లివిరిసిన
కిరణం”మన పాఠశాల “.
మన ఒమన్ దేశం లోని మస్క ట్ సిటీ లో ఉన్న తెలుగు ప్రవాసీయులకు,వారి పిల్లలకు సంస్కృతి ,
సాంప్రదాయములు దూరం చేయకూడదనే ఆలోచనతో మన “తెలుగు కళా సమితి” వారి ఆధ్వర్యంలో convener “అనిల్ కుమార్ కడించర్ల” గారి ప్రోత్సాహం తో 2016 సం . 7 ఫిబ్రవరి రోజున శ్రీకారం చుట్టడం జరిగినది. 2016 లో జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమం లో పాఠశాల కార్యక్రమంలో మొత్తం 28 మంది విద్యార్దులతో మన పాఠశాల ఆరoభఉత్సవం తో ఘనంగా మొదలుపెట్టడం జరిగినది .
ఈ తరగతులకు మొత్తం ముగ్గురు అధ్యాపకురాళ్లు (వల్లి వేణుగోపాల్ గారు,మమతా కడించర్ల గారు,శారద వారణాసి గారు) పిల్లలకు తమ మాతృ భాషను భోదించడానికి వాలెంటయిర్ గా ముందుకు వచ్చి తరగతులను నిర్వహించే బాధ్యతను చేపట్టడం జరిగినది. మన తరగతి గదుల నిర్వహణ కోసం మొదట్లో “ఇండియన్ స్కూల్ వాదీ కబీర్ “ప్రధానోపాధ్యాయులు శ్రీ. నాగేశ్వరరావు గారు తరగతి గది ని ఇచ్చి తమ సహృదయం ను చాటుకున్నారు.వారు మన పాఠశాల నిర్వహణ కు చేసిన అమోఘమైన ఈ సహాయం మన పాఠశాల నిర్వహణకు ఎంతగానో దోహద పడింది. అలా మన పాఠశాల నిర్వీగ్నంగా కొనసాగాయి. ఈ పాఠశాల నిర్వహణలో మనకు ఎదురైన ఒడిదుడుకులను అదిగమించి ఈ నాటికి మన తరగతి గధి లో సంఖ్య 45 కు చేరడానికి మన తెలుగు కళా సమితి కార్యవర్గం ఎంతగానో సహకారాన్ని చేకూర్చారు.
ఈ విధంగానడుస్తున్న మన పాఠశాలలో ఎంతో మంది మహిళా అధ్యపకురాళ్ళు వాలెంటెరి సేవలు అందించడం జరిగినది . వారి అందరి సేవ అనిర్వచనీయం . వీరoదరికి మా కృతజ్ఞతాభివందనలు. అంచలంచాలు గా ఎదిగిన మన సమూహం ఇప్పటికీ ఒక నిర్దిష్టతని సంపాదించుకొని ఒక ప్రత్యేకమైన సిలబస్ ని సమకూర్చుకొని 4 విభాగాలు గా పిల్లలని ఎంపిక చేసుకొని వారికి భోధన కార్యక్రమం చేపట్టటం జరిగినది. ఈనాటి మన సిలబస్ లో 4 విభాగాలు
అవి 1. పలుకు
- అడుగు
- నడక
- పరుగు
ప్రతీ విభాగం లో 2 సెమిస్టర్లు గా ఉంటుంది . ఒక విభాగం లో పరీక్ష ఉత్తీర్ణత పొందిన వారు రెండవ సెమిస్టర్ కి అర్హులు. ఇలా ప్రతీ విభాగం లో పరీక్షలు ఉత్తీర్ణులవుతూ చివరగా వారికి తెలుగు భాష ప్రావీణ్యత సర్టిఫికేటు పొందడానికి అర్హులుగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడుతారు. ప్రస్తుతం తరగతిగది లోఉపాధ్యాయినిలు గా వ్యవహరిస్తున్న శారదగారు, రాణిగారు, సునీతగారు, అపర్ణగార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేస్తున్నాము. ఈ తెలుగు విభాగానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న TNB కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మన పాఠశాల లో అడ్మిషన్ పొందగోరు విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
TNB KUMAR – 0096892446936
SHARADA DEVI – 00968 91198739
RANI MADHAV -0096891283846
SUNITA – 0096894150076
APARNA – 0096895247656